ఆకట్టుకుంటున్న కార్తికేయ ‘రాజా విక్రమార్క’ టీజర్‌

4 Sep, 2021 13:29 IST|Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. యాక్షన్‌ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీ సరిపల్లి దర్శకత్వ వహించారు. 88 రామారెడ్డి నిర్మాత. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాను టీజర్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ చేతుల మీదుగా విడుదలైంది. ఈ టీజర్‌ కార్తికేయ, తనికేళభరణి మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. టీజర్‌ విషయానికొస్తే.. కార్తికేయ ఇందులో ఎన్‌ఐఏ ఎజెంట్‌గా కనిపించాడు. కొత్తగా అపాయింట్‌ అయిన కార్తికేయ ఓ సీక్రెట్‌ మిషన్‌లో అనుకొకుండా నిందితుడిని కాల్చి చంపుతాడు.

చదవండి: ‘మా’ ఎన్నికలు : అందుకే సుధీర్‌, అనసూయలను తీసుకున్నాం: ప్రకాశ్‌ రాజ్‌

దీనిపై తనిళకేళ భరణికి, కార్తికేయకు మధ్య జరిగే సంభాషణలు అలరిస్తున్నాయి. అలాగే చివర్లో ‘చిన్నప్పుడు కృష్ణ గారిని.. పెద్దయ్యాక టామ్ క్రూజ్‌ని చూసి ఆవేశపడి జాబ్‌లో జాయిన్ అయిపోయా కానీ.. సరదా తీరిపోతోంది. ఇంక నావల్ల కాదు’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఇక కార్తికేయ పాత్రకి యాక్షన్‌తో పాటు కామెడీ టచ్ కూడా ఇచ్చినట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. కాగా రాజా విక్రమార్కలో కార్తికేయకు జోడిగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించింది. తనికెళ్ల భరణి ,సాయి కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

చదవండి: 2 ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ‘తలైవి’ మూవీ, మేకర్స్‌ భారీ ఒప్పందం!

మరిన్ని వార్తలు