చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నావ్.. మగధీర కాదిక్కడ

26 Feb, 2021 18:26 IST|Sakshi

సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం టీజర్‌ను మెగా హీరో వరుణ్‌ తేజ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు బెస్ట్‌ విషెస్‌ అందజేశారు. మరి కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన హీరో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడం.. 'పెళ్లి తర్వాత జరగాల్సినవి పెళ్లికి ముందే జరిగిపోతే నీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టముంటది' అని హీరో ఫ్రెండ్‌ వాదించడం లాంటి అంశాలతో టీజర్‌ మొదలవుతుంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి హీరో తన లవ్ స్టోరీ గురించి వినిపిస్తూ..నువ్వు నా నుంచి చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నావ్.. మగధీర కాదిక్కడ మర్యాదరామన్న' అంటూ చెప్పే  డైలాగులు నవ్వు తెప్పిస్తాయి.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన టీజర్‌..సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. చిత్ర షుక్ల, మిషా నారంగ హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.  సాయి కొర్రపాటి సమర్పణలో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించగా, సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సినిమా టైటిల్‌తోనే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు ‘తెల్లవారితే గురువారం’ ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

చదవండి :  (అల్లు అర్జున్‌కు నో చెప్పడమా?: ప్రియా వారియర్‌)
(అదీ ప్రభాస్‌ రేంజ్‌: వంద కోట్ల రెమ్యునరేషన్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు