వరుణ్‌, లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ ఎలా మొదలైందంటే..!

8 Jun, 2023 16:53 IST|Sakshi

'మెగా' వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు నిన్నటి వరకు పలు రూమర్స్‌ వచ్చాయి. ఇప్పుడదే అధికారికమైంది. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిపెళ్లిపై  అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు (జూన్‌ 9)న హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం.

(ఇదీ చదవండి: ట్రోలర్స్​కు ఫోటోలతో ​ కౌంటర్​​ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ)

పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌, వరుణ్‌ కోసం రేపు జరిగే ఎంగేజ్‌మెంట్ పార్టీకి తన కుటుంబంతో కలిసి హాజరవుతారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో  పాటు రామ్ చరణ్, ఉపాసన ఈ నిశ్చితార్థంలో పాల్గొంటారు. ఇక వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. అయితే, అంతకంటే ముందే వీళ్లిద్దరికీ పరిచయం. నిహారిక, లావణ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకునేవారు, కలిసి జిమ్ చేసేవారు. అలా నిహారిక ద్వారా వరుణ్-లావణ్య ఒకరికొకరు పరిచయం. అలా వీళ్లిద్దరూ కలిసి సినిమాల్లో నటించక ముందే ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. రేపు ఎంగేజ్ మెంట్ పూర్తయిన తర్వాత, పెళ్లి తేదీని ప్రకటిస్తారు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పిన మాటల ప్రకారం చూస్తే, ఈ ఏడాదిలోనే వరుణ్-లావణ్య పెళ్లి ఉంటుంది. 

(ఇదీ చదవండి: విడాకులు తీసుకున్న నటి.. భర్త ఎమోషనల్ పోస్ట్!)

మరిన్ని వార్తలు