రామ్‌చరణ్‌ బర్త్‌డే: ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్‌

26 Mar, 2021 10:59 IST|Sakshi

రేపు(శనివారం) రామ్‌చరణ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా చెర్రీ అభిమానులు సోషల్‌ మీడియాలో ఇప్పటి నుంచే నానా సందడి చేస్తున్నారు. రామ్‌చరణ్‌ సినిమా పోస్టర్లను, అతడి స్టిల్స్‌ను షేర్‌ చేసుకుంటూ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అభిమానుల కోసం సాయిధరమ్‌ తేజ్‌ రిలీజ్‌ చేసిన కామన్‌ డీపీ అంతంత మాత్రంగానే ఉండటంతో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. క్రియేటివ్‌గా కాకుండా ఓ సాదాసీదా ఫొటోను వదిలారంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని కూల్‌ చేసేందుకు మోషన్‌ పోస్టర్‌ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశాడు. ఇందులో నిప్పుల మధ్యలో నుంచి దూకుతున్న సింహంలా కనిపించాడు చెర్రీ. ఆర్‌ఆర్‌ఆర్‌లో నిప్పుకు ప్రతీకగా రామ్‌చరణ్‌ను చూపించడంతో మోషన్‌ పోస్టర్‌లో కూడా నిప్పునే ప్రధానంగా ఎంచుకున్నారు. డీపీ కంటే ఈ వీడియో వంద రెట్లు నయమంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా వుంటే చరణ్‌ ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో ఆలియా సీతగా అతడితో జోడీ కడుతోంది. చెర్రీ బర్త్‌డేను పురస్కరించుకుని ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది చిత్రయూనిట్‌. అందులో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు రామరాజు లుక్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

చదవండి: హీరోయిన్‌ కీర్తి వల్ల బతుకు బస్టాండ్‌ అయ్యింది : నితిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు