మరో మూవీకి వరుణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. ఆ దర్శకుడితో ప్రయోగం

30 Jan, 2021 19:25 IST|Sakshi

సినీ బ్యాగ్రౌండ్‌ ఉన్నప్పకీ.. కష్టపడి పైకొస్తున్న హీరో వరణ్‌ తేజ్‌. మెగా హీరోలంతా పక్కా కమర్షియల్‌ సినిమాలను ఎంచుకుంటే.. ఈ మెగా ప్రిన్స్‌ మాత్రం వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన కొత్త దర్శకుడు కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్షన్‌లో `గని` సినిమా చేస్తున్నాడు. ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ  టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుదల కాబోతుంది.

దీంతో పాటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌3 సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు విడుదలకాకముందే మరో సినిమాని లైన్లో పెట్టాడు ఈ మెగా హీరో. ‘గరుడవేగా’తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో వరుణ్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్‌. కథ ప్రకారం ఈ మూవీ షూటింగ్‌ మొత్తం లండన్‌లోనే జరగనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్‌ మొదలు పెట్టనున్నారని టాక్‌. ఇక ఈ సినిమాకు భోగవల్లి ప్రసాద్‌ ప్రొడ్యుసర్‌గా వ్యవహరించనున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు