మూడు భాషల వసంత కోకిల

6 Nov, 2020 03:32 IST|Sakshi

‘కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని..’ పాట చాలామందికి తెలుసు. కమల్‌హాన్, శ్రీదేవి జంటగా రూపొందిన ‘వసంత కోకిల’ సినిమాలోని ఈ పాట ఇప్పటికీ ఎక్కడోచోట వినపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాని గుర్తు చేయడానికి కారణం తమిళ నటుడు బాబీ సింహా ‘వసంత కోకిల’ పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నారు. నేడు బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని హీరో రానా విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్లు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మాత రామ్‌ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రమణన్‌ పురుషోత్తమ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడీగా  కాశ్మీర పర్దేశీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘‘రొమాంటిక్‌ థ్రిల్లర్‌ జానర్‌గా ఈ సినిమా రెడీ అవుతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: రాజేశ్‌ మురుగేశన్, కెమెరా: గోపీ అమరనాథ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌:  సతీష్‌ సుందర్‌ రాజ్, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: జె. విద్యా సాగర్, యు. దిలీప్‌ కుమార్, నిర్మాతలు: రజనీ తాళ్లూరి, రేష్మీ సిం.

మరిన్ని వార్తలు