టీజర్‌ చూస్తే బ్లాస్టింగ్‌

19 Sep, 2022 04:23 IST|Sakshi
చంద్రబోస్, సుకుమార్, చేనాగ్, జేడీ స్వామి

 – సుకుమార్‌

‘‘వేద’ చిత్రం మోషన్  పోస్టర్‌ చాలా బాగుంది. టీజర్‌ చూస్తే బ్లాస్టింగ్‌. ఆ ఏడు కొండలులాగా ఈ సినిమాకు ఏడుగురు నిర్మాతలు ఉన్నారు.. ఇక్కడే వీరు సక్సెస్‌ అయ్యారు. ఈ సినిమా హిట్‌ కావాలి’’ అని ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అన్నారు. చేనాగ్, ప్రాచీ థాకర్‌ జంటగా జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వేద’.

  జె.సుధాకర్, శివ.బి, రాజీవ్‌ కుమార్‌.బి, శ్రీనివాస్‌ లావూరి, రాజేంద్రకనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని(అమెరికా) నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని సుకుమార్‌ విడుదల చేయగా, రచయిత చంద్రబోస్‌ మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. ‘‘సైకో రొమాంటిక్‌ థ్రిల్లర్‌ చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి. ‘‘సమాజానికి ఉపయోగపడే ప్రయోగాత్మక చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు.  
 

మరిన్ని వార్తలు