Honey Rose: 15 ఏళ్ల కిందటే తెలుగులో నటించిన హనీరోజ్‌

27 Jan, 2023 13:08 IST|Sakshi

సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. రెండూ హిట్టే. అయితే వీరసింహారెడ్డి కంటే కూడా వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వసూళ్లలో ఎక్కువ జోరు చూపిస్తోంది. ఇకపోతే వీరసింహారెడ్డిలో నటించిన హనీరోజ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తెలుగులో హనీరోజ్‌కు బోలెడంత పాపులారిటీ వచ్చింది. అసలు ఆమె ఎవరు? అని చాలామంది ఫ్యాన్స్‌ గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

హనీరోజ్‌ 14వ ఏట నుంచే నటించడం మొదలుపెట్టింది. మలయాళంలో వచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ తన మొదటి చిత్రం. ఆ తర్వాత ఏడాది ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో కథానాయికగా నటించింది. ఇందులో శివాజీ హీరోగా చేశాడు. త్రివేండ్రం లాడ్జ్‌ సినిమాతో మంచి బ్రేక్‌ లభించింది. ఆ సినిమా హిట్‌ అయిన తర్వాత తన పేరును ధ్వని నంబియార్‌ నుంచి హనీరోజ్‌గా మార్చుకుంది. అప్పటినుంచి వరుస పెట్టి మలయాళంలో సినిమాలు చేసుకుంటూ పోయిన హనీ మధ్యలో ఓసారి ఈ వర్షం సాక్షిగా చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. మొత్తానికి 'ఆలయం' సినిమాతో దాదాపు 15 ఏళ్ల కిందటే తెలుగు ప్రేక్షకులను పలకరించిన హనీరోజ్‌ ఇన్నాళ్లకు టాలీవుడ్‌లో గుర్తింపు దక్కించుకుంది.

చదవండి: రమ్య నాకు తిండి కూడా పెట్టదు.. సుపారీ ఇచ్చి నన్ను చంపించే ప్రయత్నం: నరేశ్‌
ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం

మరిన్ని వార్తలు