బాబాయ్‌.. అబ్బాయ్‌.. ఓ మల్టీస్టారర్‌

19 Nov, 2020 00:10 IST|Sakshi

తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్స్‌కు క్రేజ్‌ తీసుకొచ్చిన హీరోల్లో వెంకటేశ్‌ ఒకరు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేశ్‌బాబుతో, ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించారాయన. గత ఏడాది మేనల్లుడు నాగచైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేశారు. ఇప్పుడు అన్న సురేశ్‌బాబు కొడుకు రానాతో సినిమా చేయనున్నారని టాక్‌. తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌ అని, తెలుగుకి అనుగుణంగా కథని మార్చి, పక్కా స్క్రిప్ట్‌ రెడీ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తారని సమాచారం. డిసెంబర్‌ 13న వెంకటేశ్‌ పుట్టినరోజు సందర్భంగా బాబాయ్‌–అబ్బాయ్‌ సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉందట. కాగా క్రిష్‌ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ‘బళ్లారి బావ..’ పాటలో రానాతో కలసి వెంకటేశ్‌ సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఫుల్‌ సినిమాలో ఇద్దరూ కనిపిస్తే సందడి డబుల్‌ అనొచ్చు.

రియాలిటీ షోలో..
మల్టీస్టారర్‌ సినిమా కంటే ముందు వెంకటేశ్‌–రానా ఓ రియాలిటీ షో చేయనున్నట్లు టాక్‌. ఇటీవల రానా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించారు.  దానికోసం ఈ ఇద్దరూ ఓ షో చేయనున్నారట. అలాగే ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ వీరి కాంబినేషన్‌లో ఓ రియాలిటీ షోకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు