లెక్చరర్‌ పాత్రలో వెంకటేశ్‌

28 Oct, 2020 07:55 IST|Sakshi

‘పెళ్లిచూపులు’ చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేసిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని రూపొందించారు. మూడో సినిమాకే వెంకటేశ్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గుర్రపు పందేల బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే విషయమూ తెలిసిందే. అయితే ఈ సినిమాలో వెంకటేశ్‌ లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారన్నది తాజా సమాచారం. ఆయన లెక్చరర్‌గా కనిపించే పోర్షన్‌ మొత్తం వినోదాత్మకంగా ఉంటుందట. సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం వెంకటేశ్‌ ‘నారప్ప, ఎఫ్‌ 3’ సినిమాలు కమిట్‌ అయ్యున్నారు. ఇవి పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది వేసవిలో తరుణ్‌ భాస్కర్‌తో చేసే సినిమా ఆరంభం కానుందని టాక్‌. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్ధిన్‌ సిద్ధిఖీని నటింపజేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. 

మరిన్ని వార్తలు