దృశ్యం- 2పై కీలక అప్‌డేట్‌..

25 May, 2021 20:10 IST|Sakshi

హీరో వెంకటేశ్‌ శరవేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ‘నారప్ప’ (తమిళ చిత్రం ‘అసురన్‌’కు తెలుగు రీమేక్‌) సినిమా షూట్‌ను పూర్తి చేసిన వెంకటేశ్‌ తాజాగా ‘దృశ్యం 2’ సినిమాకు కూడా పూర్తిగా ప్యాకప్‌ చెప్పారు. ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే దృశ్యం 2ను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని భావించినా నిర్మాత సురేశ్‌ బాబు వాటిని ఖండించారు. అయితే తాజాగా సినిమాల విడుదలకు ఆలస్యం అవుతుండటంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

ఓటీటీ ద్వారా 'దృశ్యం 2' సినిమాను రిలీజ్ చేసి, థియేటర్లు తెరుచుకున్న తరువాత 'నారప్ప'ను రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెంటకేష్‌ వెల్లడించినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. మాతృకను డైరెక్ట్‌ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు కూడా దర్శకత్వం వహించారు. అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన రూపొందిన సినిమానే దృశ్యం-2. ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్‌గాతెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ జంటగా నటించారు. 

చదవండి : తారక్‌ సినిమా కోసం ప్రశాంత్‌ నీల్‌ ఎంత తీసుకుంటున్నారంటే..
చిరు, పవన్‌, వెంకీతో సహా అంతా..ఆ కథలే, ఎందుకు?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు