F3 Movie: మరోసారి వాయిదా పడ్డ ఎఫ్‌ 3 మూవీ, సమ్మర్లో ఈ నవ్వుల పండగ..

21 Dec, 2021 11:54 IST|Sakshi

Venkatesh Daggubati And Varun Tej F3 Movie Release Date Postponed Again: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్‌ రావిపూడి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించగా.. ఆ తర్వాత  ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని ప్రకటించారు.

చదవండి: వెనక్కి తగ్గిన భీమ్లానాయక్‌, విడుదల తేదీ వాయిదా

తాజాగా ఇదే తేదీకి భీమ్లా నాయక్‌ను వాయిదా వేయడంతో ఎఫ్‌ 3 మూవీని మరోసారి వాయిదా వేశారు మేకర్స్‌.  సమ్మర్‌కు రిలీజ్‌ చేయబోతున్నామంటూ తాజా విడుదల తేదీని ప్రకటించారు. నవ్వల పండగ వచ్చే ఏడాది సమ్మర్‌లో అంటూ ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు విడుదల తేదీని వెల్లడించారు. ‘నవ్వుల పండగా ఇప్పుడు సమ్మర్‌లో.. ఏప్రిల్‌ 29న విడుదల, గెట్‌ రెడీ ఫర్‌ సమ్మర్ సోగాళ్లు’ అంటూ ఎఫ్ 3 మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. కాగా ఈ సినిమాకు.. ఎఫ్ 2 స్టోరీకి ఏమాత్రం సంబంధం ఉండదు అని గతంలోనే అనిల్‌ రావిపూడి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ త్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు.

చదవండి: పుష్ప స్పెషల్‌ సాంగ్‌పై సమంత హాట్‌ కామెంట్స్‌, సెక్సీగా కనిపించాలంటే..

మరిన్ని వార్తలు