వైరల్‌: ‘నారప్ప’ సినిమా.. వెంకీ అభిమాని నిరాహార దీక్ష

30 Jun, 2021 17:36 IST|Sakshi

కరోనా వ్యాప్తి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లన్నీ మూత పడ్డాయి. ప్రస్తుతం కోవిడ్‌ కేసులు పరంగా కాస్త కుదుటపడగా, ప్రభుత్వాలు అన్‌లాక్‌ ప్రక్రియను మొదలు పెట్టాయి. కానీ ‍డెల్టా వైరస్‌ తాకిడి నేపథ్యంలో ధియేటర్లను ఇప్పట్లో తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలన్నీ ఓటీటీ వైపే అడుగులేస్తున్నాయి.

తాజాగా వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపగా, వెంకి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమా లను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సురేష్ బాబు సుముఖంగా ఉండడంతో పాటు సన్నాహాలు కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ కు చెందిన అల్లుడు కిరణ్ తమ అభిమాన హీరో వెంకటేష్‌ సినిమా నారప్పను థియేటర్‌లోనే చూడాలని కోరుకుంటున్నాడు.

అందుకు బదులుగా అతను ఓటీటీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష ను చేపట్టాడు. వెంకీ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలంటూ అతన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాడు. అందుకు ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్న ఫోటోను కిరణ్ షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్‌గా మారి నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. 
 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్‌పై ‘డాక్టర్‌ బాబు’.. ఇదేం వాడకం బాబోయ్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు