కేరళలో ‘దృశ్యం 2’ కీలక సన్నివేశాలు

30 Mar, 2021 06:27 IST|Sakshi

కుటుంబంతో సహా కేరళ వెళ్లారు రాంబాబు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికేనా? అంటే కథ ప్రకారం అంతే. ఇంతకీ రాంబాబు అండ్‌ ఫ్యామిలీ ఏం చేసింది? పోలీసులు ఎందుకు వెంటాడుతున్నారు? అనే విషయం ‘దృశ్యం 2’లో తెలుస్తుంది. ‘దృశ్యం’ చూసినవాళ్లకు విషయం ఏంటో తెలుసు. ఆ సినిమాలో కేసు క్లోజ్‌ అయిపోతుంది. రాంబాబు కుటుంబం హ్యాపీ ఫీలవుతుంది. కానీ మళ్లీ కేసు రీ ఓపెన్‌ అవ్వడమే ‘దృశ్యం 2’ కథ. మలయాళ ‘దృశ్యం’కి సీక్వెల్‌ ఇది.

తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ప్రస్తుతం మలి భాగం ‘దృశ్యం 2’లోనూ నటిస్తున్నారు. వెంకటేశ్‌ పాత్ర పేరు రాంబాబు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ కేరళలో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్‌  చేశారు. ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు