ఆ సాంగ్‌ వింటుంటే స్వర్ణకమలం గుర్తొచ్చింది– వెంకటేశ్‌

30 Sep, 2021 10:13 IST|Sakshi

డ్యాన్సర్‌ సంధ్యారాణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకుడు. నిశ్రింకళ ఫిల్మ్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘పోనీ పోనీ..’ పాటను విడుదల చేసిన వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు వచ్చి చాలా రోజులైంది.‘పోనీ పోనీ...’ పాటను చూస్తుంటే విలక్షణ కథకు ఎమోషన్స్‌ కలగలిపినట్లుంది. నాకు నా ‘స్వర్ణకమలం’ సినిమా గుర్తొచ్చింది. చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.
(చదవండి: డ్రగ్స్‌ అమ్ముతూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు)

‘‘స్వర్ణ కమలం’ సినిమాను చాలాసార్లు చూశాను. ఎమోషనల్‌గా సాగే ‘పోనీ పోనీ..’ పాటను వెంకటేశ్‌గారు లాంచ్‌ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు సంధ్యారాణి. ‘‘మా సినిమాకు ‘స్వర్ణకమలం’ ఓ స్ఫూర్తి’’ అన్నారు రేవంత్‌. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌.

మరిన్ని వార్తలు