కేరాఫ్‌ రాయలసీమ!

10 Jan, 2021 04:18 IST|Sakshi

‘కేరాఫ్‌ కంచరపాలెం’తో కంచరపాలెం గ్రామంలో జరిగే కథను కళ్లకు కట్టారు దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఆ తర్వాత ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ తెరకెక్కించారు. తాజాగా రానా హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి వెంకటేశ్‌ మహా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే పీరియాడికల్‌ చిత్రం ఇది అని తెలిసింది. ఈ స్క్రిప్ట్‌కి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని టాక్‌. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. వెంకటేశ్‌ మహా తొలి చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’ను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రానా సమర్పించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మరిన్ని వార్తలు