నేడు దివంగత నిర్మాత రామానాయుడు 6వ వర్థంతి

18 Feb, 2021 15:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు చలన చిత్ర నిర్మాతగా వచ్చి దేశవ్యాప్తంగా ఎన్నో బాషల్లో సినిమాలు నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచారు ప్రముఖ దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు. నేడు ఆయన 6వ వర్థంతి. 2015 ఫిబ్రవరి 18న ఆయన అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెండవ కుమారుడు, హీరో విక్టర్‌ వెంకటేష్‌ సోషల్‌ మీడియా వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. తన ట్విటర్‌ ఖాతాలో తండ్రి చిత్ర పటాన్ని గురువారం షేర్‌ చేస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.


‘ఇన్నేళ్లు గడిచాయి. కానీ ఈ రోజు మిగిల్చిన చేదు అనుభవాన్ని మాత్రం అంత ఈజీగా మరవకలేకపోతున్నాం. ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న. లవ్‌ యూ. మిస్‌ యూ’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే ఆయన పెద్ద కూమారుడు, నిర్మాత సురేష్‌ బాబు.. తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఫిల్మ్ నగర్‌లోని రామానాయడు విగ్రహానికి సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి నివాళులు ఘటించారు.

(చదవండి: ఆసక్తి రేపుతున్న నారప్ప టీజర్‌
           (వెంకీ మామ ఇంటి పని అదిరింది)

మరిన్ని వార్తలు