రంగంలోకి దిగిన ‘నారప్ప’... టీజర్‌ అప్పుడే

5 Nov, 2020 19:47 IST|Sakshi

లాక్‌డౌన్ నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా ఇంటికే పరిమితమైన నటీనటులంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు.ఇప్పటికే నాగార్జున, బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ లాంటి అగ్రహీరోలు షూటింగ్‌లో పాల్గొనగా.. త్వరలోనే మెగాస్టార్‌ చిరంజీవి కూడా ‘ ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా ‘నారప్ప’  షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. గురువారం ఆయన సెట్‌లోకి అడుగుపెట్టారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ భారీ సినిమా షూటింగ్ గురువారం తిరిగి ప్రారంభమయ్యింది. ఇక లాక్‌డౌన్‌కి ముందు 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’  మిగిలిన షూటింగ్‌ను త్వరలోనే కంప్లీట్‌ చేసుకోనుంది.

ఇక వెంకటేశ్‌ 60వ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్‌ 13న ‘నారప్ప’ టీజర్‌ విడుదల కానుందట. అయితే టీజర్‌ విడుదల తేదిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్‌’ చిత్రాన్నే తెలుగులో ‘నారప్ప’గా రీమేక్‌ చేస్తున్నారు.అక్కడ ధనుష్‌ పోషించిన పాత్రకు సరిపోయేలా ఉన్న వెంకటేశ్‌ మేక్‌ ఓవర్‌ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. తమిళంలో మంజు వారియర్‌ చేసిన పాత్రలో తెలుగులో ప్రియమణి కనువిందు చేయనుంది.

మరిన్ని వార్తలు