నువ్వు నా వరమే.. 

30 Dec, 2023 00:58 IST|Sakshi
బేబీ సారా, శ్రద్ధా శ్రీనాథ్, వెంకటేశ్‌

‘బంగారమే బంగారమే నువ్వు నా వరమే.. నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే...’ అంటూ మొదలవుతుంది ‘సైంధవ్‌’ సినిమాలోని ‘బుజ్జి కొండవే..’ పాట. వెంకటేశ్‌ హీరోగా నటించిన 75వ సినిమా ఇది. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య కీలక పాత్రలు పోషించారు.

శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం జనవరి 13న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ‘నా ఆయువంతా అందిపుచ్చుకుని నువ్వు చిందులాడవే... బుజ్జికొండవే...’ అంటూ సాంగే ‘బుజ్జి కొండవే..’ పాట లిరికల్‌ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ఎస్పీ చరణ్‌ ఆలపించారు.

‘‘తండ్రీ కూతుళ్ల అనుబంధం, వారి ఎమోషన్‌ ఈ చిత్రంలోని ప్రధానాంశం. ఈ సినిమాలో వెంకటేశ్‌ కూతురికి ఆరోగ్య సమస్య ఉంటుంది. తన కూతురిని భావోద్వేగానికి గురి చేయకుండా, తన ఎమోషన్స్‌ని దాచిపెడతాడు. పాపకు తల్లి కాకపోయినా సొంత కూతురిలా చూసుకుంటుంటుంది శ్రద్ధా శ్రీనాథ్‌’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: కిశోర్‌ తాళ్లూరు.

>
మరిన్ని వార్తలు