సరదా.. సరదాగా... 

11 Dec, 2023 03:40 IST|Sakshi

హీరో వెంకటేశ్‌ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సరదా.. సరదాగా...’ అంటూ సాగే రెండో పాటని నేడు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించి, కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా కలిసి సరదాగా సముద్రపు ఒడ్డున చిరునవ్వులు చిందిస్తూ నడుస్తున్న పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.

‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూ΄పొందుతోన్న చిత్రం ‘సైంధవ్‌’. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ‘రాంగ్‌ యూసేజ్‌..’ అనే తొలి పాటకి మంచి స్పందన వస్తోంది. ‘సరదా.. సరదాగా...’ పాట కూడా అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: యస్‌. మణికందన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌),  సహనిర్మాత: కిశోర్‌ తాళ్లూరు. 
 

>
మరిన్ని వార్తలు