నారప్ప ఫస్ట్ లిరికల్ 'చలాకి చిన్నమ్మీ..' వ‌చ్చేసింది

11 Jul, 2021 10:30 IST|Sakshi

వెంకటేశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటించారు. తమిళ సూపర్‌హిట్‌ చిత్రం ‘అసురన్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించరు. ఆదివారం జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా నారప్ప మూవీ నుంచి ‘చలాకీ చిన్నమ్మి’అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 'చిలిపి చూపుల చలాకీ చిన్నమ్మీ..ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది'..అంటూ సాగే ఈ పాట ఎంతో ఆకట్టుకుంటుంది.

అచ్చమైన పల్లెటూరి టచ్‌ ఉండేలా అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా, ఆదిత్య అయ్యంగార్‌, నూతన మోహన్‌ ఈ పాటను పాడారు. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. నారప్ప టీజర్‌తో ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు వెంకటేశ్‌. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ చిత్రంలో కార్తీక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల ముఖ్య పాత్రలు పోషించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు