‘మళ్ళీ మొదలైంది’: మోటివేషనల్‌ స్పీకర్‌గా వెన్నెల కిషోర్‌

7 Aug, 2021 20:20 IST|Sakshi

సుమంత్‌, నైనా గంగూలీ జంట‌గా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రెడ్ సినిమాస్ బ్యాన‌ర్‌పై కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతొంది. ఈ చిత్రంలో ఇన్‌స్పిరేష‌న‌ల్ సింగిల్ మ‌ద‌ర్ పాత్ర‌లో న‌టిస్తోన్న సుహాసిన లుక్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమాలో మ‌రో కీల‌క పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేసింది.

ఆ కీల‌క పాత్ర చేసిందెవ‌రో కాదు.. స్టార్ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్‌. త‌క్కువ‌గా మోటివేట్ చేస్తూ, ఎక్కువ‌గా క‌న్‌ఫ్యూజ్ చేసే ఫ్రెండ్ పాత్ర‌లో వెన్నెల కిషోర్ అలరించబోతున్నాడు. రీసెంట్‌గా ..కుటుంబం, స‌భ్యుల మ‌ధ్య ఉండే ల‌వ్ అండ్ ఎమోష‌న్స్‌తో పాటు భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని తెలిసేలా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్యవహరిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు