నటుడు అటల్‌ బిహారి పండా ఇక లేరు

6 Jun, 2021 11:21 IST|Sakshi

భువనేశ్వర్‌: చలనచిత్ర, నాటక రంగ ప్రముఖ నటుడు అటల్‌ బిహారి పండా (92) కన్నుమూశారు. ఆయన మృతితో చలన చిత్రం, నాటక రంగం కళాప్రియులు, అభిమానులు, నటీనటులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల ఆయన కోవిడ్‌ –19 బారిన పడి చికిత్సతో కోలుకున్నారు. తదనంతర అనారోగ్య పరిస్థితులతో మరోసారి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు.

సువర్ణపూర్‌ జిల్లా బొణికా గ్రామానికి చెందిన ఆయన 1944వ సంవత్సరంలో నాటక రంగంలో ప్రవేశించి 100 పైబడి నాటకాల్లో నటించారు. సంబల్‌పురి శైలిలో 65 రంగస్థల, ఆకాశవాణి నాటకాలు రచించారు.  83 ఏళ్ల ప్రాయంలో తొలి సారి 'సొలా బుఢా' అనే లఘు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో నటనకు ఆయన జాతీయ పురస్కారంతో పాటు 25వ ఒడియా చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. రెండో చలన చిత్రం 'ఆదిమ్‌ బిచారొ' వరుసగా రెండోసారి రాష్ట్ర చలన చిత్రోత్సవ పురస్కారం అందుకుంది. ఆయన మృతి పట్ల రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

చదవండి: డాక్టర్‌తో రహస్య పెళ్లి : అందుకే అందరికి చెప్పలేదు.. సంజన

మరిన్ని వార్తలు