ఆసుప‌త్రిలో చేరిన ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు

18 Sep, 2020 12:36 IST|Sakshi

సాక్షి, చెన్నై :  ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు రామ‌రాజ‌న్ (60) శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రి పాల‌య్యారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయన క‌రోనా బారిన‌ప‌డిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ కార‌ణంగానే రామరాజన్‌ ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది.  కొన్నిరోజుల క్రితం ఆయన నివాసానికి ఏసీ మెకానిక్ వ‌చ్చాడ‌ని, ఆ తర్వాత రామరాజన్‌ అనారోగ్యానికి గురైన‌ట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డుతుండ‌టంతో  వెంట‌నే  ఆయ‌న్ను కుటుంబ‌సభ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే క‌రోనా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఇంకా రావాల్సి ఉంది.  ఒక‌వేళ క‌రోనా నెగిటివ్ అని తేలితే కొద్దిరోజుల్లోనే రామ‌రాజ‌న్‌ను డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంది. (అనారోగ్య సమస్యలతో బాబు శివన్‌ మృతి)

మక్కల్ నాయగన్ సినిమాతో న‌టుడిగా త‌మిళ చిత్ర‌రంగంలో ప్ర‌స్తానాన్ని ప్రారంభించారు. ఎంగా ఓరు పాతుకుకరన్, కరాగట్టకరన్, ఎంగా ఓరు కావల్కరన్ మరియు పాతుకు నాన్ ఆదిమై వంటి సినిమాల్లో రామ‌రాజ‌న్ న‌ట‌న‌కు మంచి గుర్తింపు ల‌భించింది.  దాదాపు 10 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రామ‌రాజ‌న్ ఎక్కువ‌గా గ్రామీణ నేప‌థ్యం ఉన్న సినిమాల‌నే తెర‌కెక్కించారు. చివ‌రిసారిగా  2012లో మేధై చిత్రంలో  న‌టుడిగా క‌నిపించారు. అటు ద‌ర్శ‌క‌త్వం, ఇటు న‌ట‌నారంగంతో మ‌మేక‌మైన రామ‌రాజ‌న్ త‌మిళ ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు. త్వ‌ర‌లోనే న‌టుడిగా మరో మంచి చిత్రంతో క‌మ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. (త్వరగా కోలుకుని మా ఇంటికి రండి)

మరిన్ని వార్తలు