నివాళి అర్పిస్తున్న అలనాటి నటీమణులు

17 Aug, 2021 15:26 IST|Sakshi

కొరుక్కుపేట: అలనాటి నటి, నృత్యకారిణి, కళైమామణి రాజసులోచన 87వ జయంతిని చెన్నై టి.నగర్‌లోని పింక్‌ లోటస్‌ వేదికగా ఆదివారం రాత్రి ఎన్‌.జి.ఎల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్‌ నటి సి.ఐ.డి శకుంతల పాల్గొని రాజసులోచన చిత్ర పటానికి నివాళులర్పించారు.

కాగా నటి రాజసులోచన కుమార్తె దేవీకృష్ణ స్పాట్‌ లైట్‌ విత్‌ దేవి పేరుతో ఏర్పాటు చేసిన  వినోద భరిత యూట్యూబ్‌ చానల్‌ను సి.ఐ.డి శకుంతల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అలనాటి నటీమణులు జయమాలిని, జయ మాల, సుచరిత, రేవతి తదితరులు పాల్గొని రాజసులోచన సేవల్ని కొనియాడారు.  

మరిన్ని వార్తలు