ప్రముఖ డాన్సర్‌ కన్నుమూత

24 Jul, 2020 12:39 IST|Sakshi

కోల్‌కతా: వెటరన్ డాన్సర్‌ అమల శంకర్ కన్నుమూశారు. 101 ఏళ్ల వయసులో ఆమె కోల్‌కతాలో మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు శ్రీనంద శంకర్‌ ఫేస్‌ బుక్‌ ద్వారా తెలియజేశారు. మేం గత నెలలోనే ఆమె బర్తడేని జరిపాం. ముంబాయి నుంచి కోల్‌కతాకు విమానాలు లేవు. చాలా బాధగా ఉంది. మీకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం.  ఒక శకం ముగిసింది. లవ్‌ యూ తమ్మా. థ్యాంక్యూ ఫర్‌ ఎవ్రీ థింగ్‌ అని పోస్ట్‌ చేసింది. 

చదవండి: అసంపూర్ణం కూడా సంపూర్ణమే!

అమలా శంకర్‌ 1919 జూన్‌ 27న బంగ్లాదేశ్‌లో జన్మించింది. ప్రముఖ డాన్సర్‌ అండ్‌ కొరియోగ్రాఫర్‌ ఉదయ్‌ శంకర్‌ను పెళ్లాడింది. ఆమె ఒక గ్రామంలో పుట్టి పెరిగినప్పటికీ ఆమె తాతయ్య అక్షయ్‌ కుమార్‌ నందే ఆమెను  తనతో పాటు ప్యారిస్‌ తీసుకువెళ్లారు. ఆమె అక్క ఇంట్నరేషనల్‌ కలోనియల్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించేవారు. ఆమె 11 సంవత్సరాల వయస్సులో ఉదయ్‌ శంకర్‌ను కలిశారు. అప్పటికే ఉదయ్‌, అమల కంటే 19 సంవత్సరాలు పెద్ద. తరువాత ఉదయ్‌ డాన్స్‌లు నచ్చి ఆకర్షితురాలైన అమల అతనికి దగ్గరయ్యింది. ఉదయ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో వారిని ఒప్పించింది. 

 అమల వాళ్ల నాన్న గారు ఆమె ఒక రచయిత కావాలని ఆశ పడ్డారు. ఆమె 14 ఏళ్ల వయసులోనే సాత్‌ సగోరేర్‌ పారే అనే పుస్తకాన్ని రాసింది. తరువాత 1942లో ఉదయ్‌ను పెళ్లి చేసుకుంది. ఆయనతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో డాన్స్‌ షోలు చేశారు. తన భర్త ఉదయ్‌ రాసి, దర్శకత్వం వహించిన కల్పన అనే  కథలో అమల నటించారు కూడా. చాలా సంతోషంగా గడిచిన అమల జీవితం 101 ఏళ్ల వయసులో ముగిసింది. 

చదవండి: ఆ లవ్‌ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్‌

మరిన్ని వార్తలు