మరోసారి కెమెరాకు చిక్కిన లవ్‌బర్డ్స్‌, వీడియో వైరల్‌

11 Aug, 2021 10:27 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌, యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌ మధ్య ప్రేమాయాణం నడుస్తోందని కొంతకాలంగా బి-టౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసేందుకు సిద్దమవుతున్నారనే వార్తల వైరల్‌ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఈ లవ్‌బర్డ్స్‌ స్పష్టత ఇవ్వలేదు. వారి రిలేషన్‌పై నోరు కూడా విప్పడం లేదు. కానీ వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. తాజాగా ఈ రూమర్డ్‌ లవ్‌బర్డ్స్‌ సినిమా హాల్‌ నుంచి బయటకు వస్తూ మరోసారి కెమెరాకు చిక్కారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వీపరీతంగా వైరల్‌ అవుతుంది.

ఇందులో విక్కీ, కత్రినాలు మీడియాను చూడగానే ఒకరికొకరికి సంబంధం లేనట్లుగా వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ‘వికాట్‌, నోటంకి కపుల్‌’, అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా సిద్దార్థ్‌ మల్హోత్రా, కియార అద్వానీ నటించిన షేర్షా మూవీ రేపు విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. మంగళవారం (అగష్టు 10) ఈ మూవీ స్క్రినింగ్‌ను పూర్తి చేసుకుంది. షెర్షా స్క్రినింగ్‌కు విక్కీ, కత్రినాలు కూడా హజరయ్యారు. ఈ సినిమా స్క్రినింగ్‌ ముగిశాక థియేటర్‌ నుంచి ముందుగా విక్కీ బయటకు రాగా అతడి వెనకాలే కత్రినా వచ్చింది. అయితే కత్రినా మాత్రం కెమెరాలను చూసి అక్కడే ఆగిపోయింది . ఇక ముందుకు నడుచుకుంటూ వచ్చిన విక్కీ మరో డోర్‌ దగ్గరికి రాగానే వెనక్కి తిరిగి కత్రినా వంక చూస్తూ నవ్వాడు. కత్రినా కూడా నవ్వూతూ కనిపించింది. 

తన చెల్లలు ఇజబెల్లా వచ్చే వరకు అక్కడే ఆగిన కత్రినా తను రాగానే కలిసి బయటకు నడిచింది. ఇదిలా ఉండగా వీరిద్దరి రిలేషన్‌ గురించి ఇటీవల సూపర్‌ స్టార్‌ అనిల్‌ కపూర్‌ తనయుడు, నటుడు హర్షవర్థన్‌ కపూర్‌ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ ఛానల్‌కు ఇచ్చిన జూమ్‌ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ రూమర్డ్‌ కపుల్‌గా పిలవబడుతున్న ఆ జంట నిజంగానే ప్రేమలో ఉన్నారని వెల్లడించాడు. దీంతో హోస్ట్‌ వెంటనే మీరు విక్కీ కౌశల్‌, కత్రినా గురించి చెబుతున్నారా? అని అడగ్గానే.. అవును అని సమాధానం ఇచ్చాడు. అంతేగాక ఈ విషయం తాను బయట పెట్టినందుకు ఇబ్బందుల్లో పడతానేమో తెలియదు? కానీ వాళ్లిద్దరూ దీనిపై స్పష్టం ఉన్నారని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. 

A post shared by Viral Bhayani (@viralbhayani)

మరిన్ని వార్తలు