ఆ వ్యవహారంలోకి నన్ను లాగొద్దు: విక్కీ మాజీ ప్రేయసీ

11 Nov, 2021 13:41 IST|Sakshi

బాలీవుడ్‌ నటులు విక్కీ కౌషల్‌, కత్రీనా కైఫ్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయన్న సంగతి తెలిసిందే. వారు సీక్రెట్‌గా డైరెక్టర్‌ కబీర్‌ ఖాన్‌ ఇంట్లో రోకా చేసుకున్నారని కూడా విన్నాం. తాజాగా వారి వివాహ వేడుకలు డిసెంబర్‌ 7, 9 మధ్య రాజస్థాన్‌లో జరుగుతాయని సమాచారం. ఆ వేడుకలకు వధూవరులు సబ్యసాచి ఔట్‌ఫిట్స్ ధరించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయాలపై విక్కీ కౌషల్‌ మాజీ ప్రేయసీ హర్లీన్ సేథీ స్పందించింది.

కత్రీనా, విక్కీ కౌషల్‌ ప్రేమాయణం పుకార్లపై తనకు ఎలాంటి స్పష్టత లేదంది. వారి రిలేషన్‌షిప్‌ గురించి తనకు ఎలాంటి బాధలేదని హర్లీన్ చెప్పిందట. హర్లీన్‌ ఇప్పుడు మూవ్‌ ఆన్‌ అయిందని, తన పనిలో మునిగిపోయిందని ఆమె సన్నిహితులు ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. ఏక్తా కపూర్‌ తీస్తున్న 'ది టెస్ట్‌ కేస్‌ 2' గురించి ఎక్జైటింగ్‌గా ఉందని చెప్పారు. ఈ సిరీస్‌లో హార్లిన్‌ చుట్టు కథ తిరుగుతుందని తెలిపారు. అయితే విక్కీ ప్రేమ వ్యవహారం గురించి ఆమెతో మాట్లాడినప్పుడు తనను అందులోకి లాగొద్దు అని చెప్పిందని సమాచారం. 
చదవండి: విక్కీ కౌషల్‌, కత్రీనా కైఫ్‌ ప్రేమ మందిరం.. పెళ్లి తర్వాత మకాం అక్కడేనా?

ఇంతకుముందు ఓ ఇంటర్యూలో విక్కీ ఒంటరిగా ఉ‍న్నానని చెప్పాడు. 2019లో తన ఇన్‌స్టాగ్రామ్‌లో విక్కీని హర్లీన్‌ అన్‌ఫాలో చేయడంతో వీరిద్దరు విడిపోయారనే పుకార్లు మొదలయ్యాయి. కత్రీనా కైఫ్‌తో విక్కీ సన్నిహితంగా ఉండటం కూడా వారి బ్రేకప్‌కు కారణమట. కత్రీనా గతంలో హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండగా, విక్కీ హర్లీన్‌ సేథీతో డేటింగ్‌ చేశాడు.

మరిన్ని వార్తలు