ఆసక్తి రేపుతున్న నారప్ప టీజర్‌

13 Dec, 2020 00:20 IST|Sakshi

బర్త్‌డే సందర్భంగా వెంకటేశ్‌ తాజా ఫొటోషూట్‌ స్టిల్స్‌ను విడుదల చేశారు. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో వెంకీ లుక్‌ అదుర్స్‌ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో చేయబోయే చిత్రంలో వెంకటేశ్‌ ఈ గెటప్‌లో కనబడతారనే ఊహాగానాలు ఉన్నాయి. నారప్ప మంచివాడు. కానీ అన్యాయాన్ని సహించలేడు. కత్తి దూస్తాడు. కళ్లల్లో కనిపించే ఆ ఆగ్రహం చూస్తే శత్రువులు పారిపోవాల్సిందే. ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన వెంకటేశ్‌ ఇప్పుడు నారప్పగా మంచి మాస్‌ పాత్రలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన వెంకీ లుక్స్‌ బయటికొచ్చాయి. ఆదివారం (డిసెంబర్‌ 13) వెంకీ పుట్టినరోజు సందర్భంగా ‘గ్లింప్స్‌ ఆఫ్‌ నారప్ప’ అంటూ శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆగ్రహం నిండిన కళ్లతో, చేతిలో కత్తితో వెంకీ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ధనుశ్‌ నటించిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘అసురన్‌’కి ఇది రీమేక్‌. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డి. సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు