ఎఫ్‌ 3 ఒక మంచి ట్రీట్‌లా ఉంటుంది  – వెంకటేశ్‌ 

10 May, 2022 09:12 IST|Sakshi
శిరీష్, మెహరీన్, తమన్నా, వెంకటేశ్, అనిల్‌ రావిపూడి, వరుణ్‌ తేజ్, అలీ, సోనాల్‌ చౌహాన్‌

‘‘అందరి అభిమానులకు, కుటుంబ ప్రేక్షకులకు ‘ఎఫ్‌ 3’ చిత్రం ఒక ట్రీట్‌లా ఉంటుంది. అందరూ వచ్చి చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అందరూ ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని వెంకటేశ్‌ అన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్‌ 3’. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలుగా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘ఎఫ్‌ 2’ కంటే ‘ఎఫ్‌ 3’ ప్రేక్షకులకు హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వాలని కోరుకున్నాం. ‘ఎఫ్‌ 3’లో రే చీకటి ఉన్న పాత్ర చేశా’’ అన్నారు. (చదవండి: నన్ను నమ్మవు.. ఆడపిల్లను కదా.. సాయి పల్లవి డబ్బింగ్‌ వీడియో వైరల్‌)

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యాక్షన్‌ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ ‘ఎఫ్‌ 3’ ఫ్రెష్‌నెస్‌ని, నవ్వులను తీసుకొస్తుంది. చాలా రోజుల తర్వాత అందరూ ఏమీ ఆలోచించకుండా మీ కుటుంబాలతో కలిసి వచ్చి ‘ఎఫ్‌ 3’ ప్రారంభం నుంచి చివరి వరకు చాలా ఎంజాయ్‌ చేస్తారనుకుంటున్నాను.  ‘ఎఫ్‌ 2’ అనేది ప్రాక్టీస్‌ మ్యాచ్‌లాంటిది.. ‘ఎఫ్‌ 3’ అనేది మెయిన్‌ మ్యాచ్‌.. ఈ మ్యాచ్‌లో సిక్స్‌ కాదు.. బాల్‌ స్టేడియం బయటకి వెళుతుంది. మీ అందరికీ ‘ఎఫ్‌ 3’ నచ్చుతుంది’’ అన్నారు.  

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ –‘‘ఎఫ్‌ 3’ ట్రైలర్‌లో చూపించింది కొన్ని నవ్వులు మాత్రమే.. సినిమాలో అంతకుమించిన నవ్వులను మీ కోసం దాచి ఉంచాం. ‘ఎఫ్‌ 3’లో మోర్‌ ఫన్‌ అని పెట్టాం. ఈ రోజు ట్రైలర్‌కి వచ్చిన స్పందనను బట్టి చెబుతున్నాం.. ‘ఎఫ్‌’ ఫర్‌ ఫ్యామిలీ.  ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయడంలో వెంకటేశ్‌గారు ఎవరెస్ట్‌.. ఆ ఎవరెస్ట్‌ పక్కన నటించేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ని చూస్తే ‘ఇంత కామెడీ చేయగలడా?’ అంటారు. ఈ ఫ్రాంచైజీని నిర్మించడానికి సపోర్ట్‌ చేసిన నిర్మాతలు ‘దిల్‌’ రాజు, శిరీష్‌గార్లకు థ్యాంక్స్‌’’ అన్నారు. 

అలీ మాట్లాడుతూ – ‘‘ఈ చంటి (వెంకటేశ్‌ని ఉద్దేశించి) ‘ఎఫ్‌ 3’లో మామూలుగా చేయలేదు. ఇక్కడ మా చంటి (వరుణ్‌ తేజ్‌ని ఉద్దేశించి).. వీరిద్దరూ ఈ సినిమాని తమ భుజాలపై మోశారు’’ అన్నారు.  

మరిన్ని వార్తలు