షారుక్‌, సల్మాన్‌లో ఎవరు కావాలి? విద్యాబాలన్‌ రిప్లై ఇదే!

8 Jun, 2021 14:41 IST|Sakshi

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగే ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానాలిచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ విద్యాబాలన్‌కు కొంచెం క్లిష్టమైన ప్రశ్న విసిరాడు. కానీ దీనికి కూడా ఆమె ఎంతో తెలివిగా చాకచక్యంగా సమాధానమివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అతడు ఏం అడిగాడంటే.. షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌.. వీళ్లిద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటావు? అని ప్రశ్నించాడు. దీనిపై విద్యాబాలన్‌ స్పందిస్తూ తన భర్త సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌(ఎస్‌ఆర్‌కే) అని దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. అంతేకాదు భర్తతో కలిసి దిగిన ఫొటోను సైతం షేర్‌ చేసింది.

ఇదిలా వుంటే ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'షేర్నీ’ ట్రైలర్‌ ఇటీవలే రిలీజైంది. ఇందులో ఆమె అటవీశాఖ అధికారిణిగా కనిపించింది. మనిషికి, మృగాలకు మధ్య జరిగే కథే షేర్నీ. మధ్యప్రదేశ్‌ అడవుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. అమిత్‌ మసుర్కర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం జూన్‌ 18న అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కానుంది. మరోవైపు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'మహాభారత్‌ 2'లోనూ ఆమె నటించనుంది.

చదవండి: విద్యాబాలన్‌కు దగ్గరైన షాహిద్‌, కరీనా మనసు ముక్కలు

ప్రముఖ చిత్రకారుడు ఇళయరాజా మృతి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు