ఓటీటీలోకి 'జల్సా' చిత్రం.. ముచ్చటగా మూడోసారి

8 Mar, 2022 16:40 IST|Sakshi

Vidya Balan Jalsa Movie Released In OTT: కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినిమాలకు ప్రత్యామ్నాయంగా కనిపించినవి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌. తర్వాత కొద్ది రోజులకు చిన్న సినిమాలే కాకుండా పెద్ద సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇవే కాకుండా బడా హీరోలు, అగ్ర నటులు సైతం ఓటీటీకే మొగ్గు చూపారు. బాలీవుడ్‌లో అత్యుత్తమ ప్రతిభగల నటీమణుల్లో విద్యా బాలన్‌ ఒకరు. ఒటీటీలో సినిమాను విడుదల చేసి హిట్‌ కొట్టిన మొదటి బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌. ఆమె 2020లో నటించిన 'శకుంతల దేవి' చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. 

తర్వాత 2021లో 'షేర్ని' మూవీతో ఆ విజయ పరంపరను కొనసాగించింది. తాజాగా 'జల్సా' సినిమాతో తాను హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. జల్సా సినిమాను ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు విద్యా బాలన్‌ నటించిన 'తుమ్హారీ సులు' డైరెక్టర్‌ సురేష్‌ త్రివేణి దర్శకత్వం వహించారు. ఇందులో విద్యా ఒక జర్నలిస్టుగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటివరకు విద్యా బాలన్‌ రెండు చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఓటీటీలోనే విడుదలై విజయం సాధించాయి. మరీ ఈ సినిమా ఓటీటీలో హిట్‌ కొట్టి హ్యాట్రిక్‌ సాధిస్తుందో చూడాలి. 

మరిన్ని వార్తలు