వివాహంలో అది చాలా భయంకరమైనది: విద్యాబాలన్‌

11 Mar, 2021 20:07 IST|Sakshi

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నిర్మాత సిద్దార్థ్‌ రాయ్‌ను 2012 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం కూడా ఆమె సినిమాల్లో నటిస్తూ సక్సెస్‌ ఫుల్‌ నటిగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వివాహ బంధంపై స్పందించారు. తన ఎనిమిదేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్నారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య ప్రేమను నిలుపుకోవడం సులభమే కానీ ఆ ప్రయాణమే భయంకరంగా ఉంటుందన్నారు.

‘ఎందుకంటే భార్యభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, మనస్పర్థలు సాధారణంగా ఉండేవే. కానీ వాటిని మనం విడిచి జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించాలి. అలా కాకుండా వాటినే పట్టుకుని ఉంటే మాత్రం భార్యభర్త బంధంలో ఉండే ఆ స్పార్క్‌ పోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన ఎనిమిదేళ్ల వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ.. ‘వివాహం అనేది అన్ని విషయాల్లో భాగమై ఉంటుంది. అది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వివాహం అంటేనే ఎవరో తెలియని వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం. అది సాధారణ విషయమేమి కాదు. వారి ఇష్టాలు అయిష్టాలు, అభిరుచులు ఎరిగి మనం నడుచుకోవాలి. అందుకు తగ్గట్టుగా మనం మలచుకోవాలి.

అది సులభమే కానీ దాని కోసం మనం చాలా విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది. అదే చాలా బాధించే విషయం. అయినప్పటికి అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకుండా భాగస్వామితో ముందుకు వెళ్లాలి. అప్పుడే వైవాహిక బంధం సంతోషంగా, సాఫిగా సాగుతుంది. ఇందుకోసం చేసే ప్రయత్నాలను కూడా నేను ఇష్టపడతాను. ఈ ఎనిమిదేళ్ల నా వైవాహిక జీవితంలో నేర్చుకున్న విషయం ఇదే’ అని ఆమె అన్నారు. కాగా ఆమె సినిమాల విషయానికోస్తే ప్రస్తుతం విద్యా డైరెక్టర్‌ అమిత్‌ మసుర్కర్‌ రూపొందిస్తున్న ‘షహారీ’లో నటిస్తున్నారు. ఇందులో ఆమె మహిళ ఆటవీ అధికారిణిగా కనిపించనున్నారు. 

చదవండి: 
ట్రోల్స్‌: మగాడిలా ఉన్నానని కామెంట్‌ చేశారు
‘క్లైమాక్స్‌ చూసి అమ్మ ఏడ్చేసింది’

మరిన్ని వార్తలు