పెళ్లి పీట‌లెక్క‌నున్న లేడీ క‌మెడియ‌న్‌

1 Sep, 2020 13:34 IST|Sakshi

తెలుగు, త‌మిళ సినీ ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పంచిన హాస్య న‌టి విద్యుల్లేఖ రామ‌న్ పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. ఫిట్‌నెస్, న్యూట్రీష‌న్ నిపుణుడు సంజ‌య్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేర‌కు అభిమానుల‌కు షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. కాగా కొంత‌కాలంగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరి ప్రేమ‌కు పెద్ద‌లు అంగీకారం తెల‌ప‌డంతో పెళ్లికి ముస్తాబు అవుతున్నారు. ఆగ‌స్టు 26న రోకా ఫంక్ష‌న్ కూడా జ‌రిగిన‌ట్లు ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. (చ‌ద‌వండి: 'డ్ర‌గ్స్ లేనిదే టాలీవుడ్‌లో పార్టీలు జ‌ర‌గ‌వు')

"రోకా పూర్త‌యింది. అతికొద్ది మంది మ‌ధ్య‌ మాత్ర‌మే ఈ వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌లో మేం మాస్కులు ధ‌రించాం, కేవ‌లం ఫొటోలకు స్టిల్స్ ఇచ్చే స‌మ‌యంలో మాత్రం వాటిని తీసివేశాం. మాకు శుభాకాంక్ష‌లు చెప్పిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు" అని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు. కాగా లాక్‌డౌన్‌లో ఆమె పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి కేటాయించారు. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం తీవ్రంగా శ్రమించారు. ఎట్ట‌కేల‌కు స్లిమ్‌గా త‌యారై అంద‌రినీ ఔరా అనిపించారు.‌ (చ‌ద‌వండి: ఇప్పుడు పూర్తి నమ్మకంతో ఉన్నాను : విద్యుల్లేఖ)

We got Roka-Ed! @lowcarb.india & I had our Roka Ceremony (formal announcement) on 26.08.2020 in an intimate manner with close family around us. It was our lil’ ray of sunshine & we couldn’t be more grateful for the love we received. We wore masks & removed them for the pictures (before anyone asks!) Thank you all so much for showering us with your best wishes! The best is yet to come. 🙏🏼♥️🥰🧿 📸 - @manasimaheshphoto

A post shared by Vidyu Raman (@vidyuraman) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా