పెళ్లిలో 100 మంది అతిథులతో స్కైడైవ్ చేస్తాం​: నటుడు విద్యుత్‌ జమ్వాల్‌

9 Oct, 2021 10:53 IST|Sakshi

దళపతి విజయ్‌ హీరోగా చేసిన ‘తుపాకి’తో తెలుగు, తమిళ్‌లో పాపులర్‌ అయ్యాడు బాలీవుడ్‌ నటుడు విద్యుత్ జమ్వాల్‌. ఆయన ఇటీవలే ఫ్యాషన్‌ డిజైనర్‌ నందితా మహతానీతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ విషయాన్ని ఇద్దరూ కలిసి రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోని పోస్ట్‌ చేసి మరీ డిఫరెంట్‌గా తెలిపాడు. తాజాగా వారి మ్యారేజ్‌ ఎలా ఉండబోతోందో వివరించాడు ఈ కమాండో స్టార్‌.

పెళ్లి గురించి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘నేను రెగ్యులర్‌ కాదు. నాకు సంబంధించి ఏ విషయంలో అలా జరిగినా నాకు న​చ్చదు. మ్యారేజ్‌ ఎప్పుడు జరుగుతుందో నాకు తెలీదు. డేట్‌ కూడా చెప్పలేను. కానీ ఎలా జరుగుతుందో మాత్రం ఐడియా ఉంది. అది కచ్చితంగా విభిన్నంగా ఉంటుంది. బహుశా 100 మంది అతిథులతో కలిసి స్కైడైవింగ్ చేస్తామేమో. అలా డిఫరెంట్‌గా చేసుకుంటే ఆ కిక్కే వేరు’ అంటూ విద్యుత్‌ తెలిపాడు.

అయితే కమాండో సిరీస్‌ చిత్రాలు, ఖుదా హఫీజ్‌ చిత్రాలతో విద్యుత్‌ జమ్వాల్‌ బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సనక్‌’ త్వరలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘హాట్‌స్టార్‌’ యాప్‌లో అక్టోబర్‌ 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఆయన ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తన సొంత నిర్మాణ సంస్థ మొదటి చిత్రంలో ‘ఐబీ 71’, ‘ఖుదా హాఫీజ్: ఛాప్టర్ II’లో నటిస్తున్నాడు. 

చదవండి: ఫ్యాషన్ డిజైనర్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘తుపాకి’ విలన్‌

మరిన్ని వార్తలు