బిచ్చ‌గాడు2 టైటిల్ లోగో విడుదల

25 Jul, 2020 11:02 IST|Sakshi

నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని మరోసారి బిచ్చగాడుగా మారడానికి సిద్ధమవుతున్నారు. సౌండ్‌ ఇంజినీర్‌గా తన సినీ పయనాన్ని ప్రారంభించిన విజయ్‌ఆంటోని ఆ తరువాత 1995లో విజయ్‌ నటించిన శుక్రన్‌ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అలా పలు చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఈయన 2016లో విడుదలైన కిళక్కు కరై సాలై చిత్రం ద్వారా నటుడిగా తెరంగేట్రం చేశారు. ఆపై నటుడిగా, సంగీత దర్శకుడిగా రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న విజయ్‌ఆంటోని నాన్‌ చిత్రంతో కథానాయకుడిగా అవతారమెత్తారు. అంతే కాకుండా ఆయన ఆ చిత్రంతో నిర్మాతగానూ మారారు.

ఇలా సంగీత దర్శకుడిగా, నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా విజయ్‌ ఆంటోని రాణిస్తున్నారు. కాగా విజయ్‌ ఆంటోని నటించిన పిచ్చైక్కారాన్‌  2016లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం బిచ్చగాడు పేరుతో తెలుగులో అనువాదమై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తాజాగా జూలై 24న విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సీక్వెల్‌గా ‘బిచ్చ‌గాడు 2’ సినిమాను చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతెేకాకుండా దానికి సంబంధించిన తెలుగు, తమిళ పోస్టర్స్2ను కూడా రిలీజ్  చేశారు. విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి భారం చిత్రంతో ఉత్తమ దర్శకురాలు అవార్డు గెలుచుకున్న ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు