Bichagadu 2 : ప్రముఖ ఓటీటీలో బిచ్చగాడు-2.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే

20 May, 2023 13:06 IST|Sakshi

కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో సూపర్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన ఆ చిత్రానికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిన్న(శుక్రవారం)తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

విజయ్‌ ఆంటోనీ ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించి హీరోగా నటించారు.  కావ్య థాపర్‌ విజయ్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్‌ అవుతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ దక్కించుకుంది.

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కూడా హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. థియేటర్‌లో రిలీజ్‌ అయిన నెల రోజుల తర్వాత అంటే జూన్‌ మూడోవారం లేదా చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. 

మరిన్ని వార్తలు