Bichagadu 2 Movie: బిచ్చగాడు -2తో మరో బ్లాక్ బస్టర్ ఖాయం: విజయ్ ఆంటోనీ

6 May, 2023 23:57 IST|Sakshi

విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం బిచ్చగాడు-2.  ఈ చిత్రంలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటించింది. 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌గా   ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ నిర్వహించారు.  2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 

హీరో, దర్శకుడు విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ..  'హీరోయిన్ కావ్యే నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది. తనకు థ్యాంక్యూ. ఇండస్ట్రీలో మొదటి నుంచీ నన్ను సపోర్ట్ చేస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.  బిచ్చగాడు తర్వాత మరో బ్లాక్ బస్టర్ వస్తోంది.   మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు. ఈ సారి సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు.'  అని అన్నారు.

(ఇది చదవండి: ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి)

తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ' ఏపీ, తెలంగాణలో ఫస్ట్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం.  విజయ్ ఆంటోనీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నేను ఈ సినిమా రెండు రీళ్లు చూశాను. చాలా అద్భుతంగా ఉంది. రెండు రీళ్లకే నెక్ట్స్ ఏంటీ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.' అని అన్నారు.

నటుడు జాన్ విజయ్ మాట్లాడుతూ..  'ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమా స్టేజ్ మీద నిల్చున్నా. ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సంచలనాలు సృష్టించాడు విజయ్. తెలుగు పరిశ్రమ ఈ చిత్రాన్ని ఎంతో ఆదరించింది. ఈ సారి దర్శకుడుగా మరింత పెద్ద బాధ్యత తీసుకున్నాడు విజయ్.  ఈ మూవీ మీ అందరికీ బాగా నచ్చుతుంది." అన్నారు.

(ఇది చదవండి: క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ ఆర్టిస్టుగా మారిన రంగస్థలం మహేశ్‌)

ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'ఈ చిత్రాన్ని నాకు బాగా తెలిసిన ఉషా పిక్చర్స్ వారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఫస్ట్ పార్ట్‌లో అద్భుతమైన పాయింట్‌తో వచ్చారు. ఆ టైమ్‌లో ఈ సినిమా అన్ని బంధాలను బాగా గుర్తు చేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి సెంటిమెంట్‌తోనే ఈ చిత్రం వస్తున్నట్టు కనిపిస్తోంది. నాకు చెల్లి చెల్లీ అనే పాట చాలా ఇష్టం. ఈ పాట ఎంత గొప్పగా తీసి ఉంటారో ఊహించగలను. ఈ చిత్రాన్ని హిట్ కావాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నా.'అని అన్నారు. 

మరిన్ని వార్తలు