బిచ్చగాడు 2: బికిలి బికిలి అంటూ గొంతెత్తిన హీరో

18 Mar, 2023 00:46 IST|Sakshi
విజయ్‌ ఆంటోని

‘వీళ్లే బికిలి బికిలి బిలి బిలి.. బికిలి బికిలి బిలి బిలి...’ అంటూ పాడారు విజయ్‌ ఆంటోని. 2016లో విజయ్‌ ఆంటోని హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘పిచ్చైక్కారన్‌’ తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శశి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు ‘బిచ్చగాడు’కు సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ వస్తోంది. విజయ్‌ ఆంటోని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.

విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బికిలి’ అనే పాట మ్యూజిక్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. భాష్యశ్రీ రాసిన ఈ పాటకు మ్యూజిక్‌ కంపోజింగ్, సింగర్‌ విజయ్‌ ఆంటోనీయే కావడం విశేషం. ఇక పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకుని తన ధనబలంతో వారిని బానిసలుగా చేసి, డబ్బు ఉందన్న అహంకారంతో తిరిగేవాళ్లకు తాను బికిలీ అని పేరు పెట్టినట్లు విజయ్‌ ఆంటోని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు