Vijay antony: కుమార్తె మృతిపై స్పందించిన విజయ్‌ ఆంటోనీ.. కన్నీరు పెట్టిస్తున్న వ్యాఖ్యలు

21 Sep, 2023 21:20 IST|Sakshi

సినీ నటుడు విజయ్‌ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం గత రెండు రోజులుగా శోకసంద్రంలోనే ఉంది. ఈ క్రమంలో విజయ్‌ ఆంటోనీ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా తాజాగా స్పందించారు. అందులో ఆయన ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. తన కుమార్తెతో పాటు  తాను కూడా చనిపోయానని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. 

(ఇదీ చదవండి: విజయ్‌ ఆంటోని కూతురు మృతితో సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్‌)

'నా పెద్ద కుమార్తె ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రదేశానికి వెళ్లింది. నా కూతురు మీరా ఎంతో ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది.  కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి ఆమె వెళ్లిపోయింది. మీరా ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. ఎందుకంటే తనతో పాటే నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను.' అని విజయ్‌ ఆంటోనీ ట్వీట్‌ చేశారు.

మీరా మృతిపై అందరి హృదయాలను కదిలించే నోట్‌ను విజయ్‌ ఆంటోనీ షేర్‌ చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు నెటిజన్లను కూడా దానిని చూసి కంటతడి పెడుతున్నారు. నిర్మాత ఫాతిమాను విజయ్‌ 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా  బలవన్మరణానికి పాల్పడిన పెద్ద కుమార్తె చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. 

మరిన్ని వార్తలు