అమ్మకలను నెరవేర్చే కథ ఇది: విజయ్‌ ఆంటోనీ

14 Sep, 2021 15:31 IST|Sakshi

‘‘బిచ్చగాడు’ ఓ అమ్మ కథ అయితే, ‘విజయ రాఘవన్‌’ ఓ అమ్మ కలను నెరవేర్చే చిత్రం. ఈ సినిమాలో చాలా భావోద్వేగాలున్నాయి. ప్రేక్షకులను మా చిత్రం నిరుత్సాహపరచదు’’ అని విజయ్‌ ఆంటోని అన్నారు. ఆనంద కృషన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, ఆత్మిక జంటగా రపొందిన తమిళ చిత్రం ‘కోడియిల్‌ ఒరువన్‌’. టీడీ రాజా, డీఆర్‌ సంజయ్‌ కువర్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి ‘విజయ రాఘవన్‌’ పేరుతో ఈ నెల 17న తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో.. ‘‘ఈ చిత్ర విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి. ‘‘ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలనుకునే ఓ యువకుడి కథే ‘విజయ రాఘవన్‌’’ అన్నారు ఆనంద కృషన్‌. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ కమల్, రచయిత భాష్యశ్రీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ నివాస్‌ కె.ప్రసన్న తదితరులు మాట్లాడారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు