మరో క్రేజీ కాన్సెప్ట్ మూవీతో వస్తున్న విజయ్ ఆంటోని

20 Jan, 2024 14:41 IST|Sakshi

'బిచ్చగాడు' సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో విజయ్‌ ఆంటోని. ఆయన హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'హిట్లర్‌'. చెందూర్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై టీడీ రాజా, డీఆర్‌ సంజయ్‌కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ధన నిర్వహించారు. మణిరత్నం శిష్యుడైన ఈయన.. 'వానం కొట్టం' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్న ధన.. ఇప్పుడు 'హిట్లర్'తో రాబోతున్నారు. 

(ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ)

ఈ సినిమాలో ప్రియా సుమన్‌ హీరోయిన్ కాగా.. గౌతమ్‌ మేనన్‌, రెడిన్‌ కింగ్స్‌లీ, వివేక్‌, ప్రసన్న తదితర ఇతర పాత్రలు పోషించారు. వివేక్‌, మెర్విన్‌ల ద్వయం సంగీతమందించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం మూవీ టీమ్.. చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు. 

ధన ఇంతకుముందు తీసిన 'వానం కొట్టం' చిత్రానికి తాను చాలా పెద్ద అభిమానినని.. ఈ చిత్రాన్ని చాలా తక్కువ రోజుల్లో అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని .. ఒక వ్యక్తి సర్వాధికారాన్ని ప్రశ్నించే కథా చిత్రంగా 'హిట్లర్' ఉంటుందని హీరో విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)

>
మరిన్ని వార్తలు