‘విక్రమ్‌ రాథోడ్‌’గా వస్తున్న విజయ్‌ ఆంటోనీ

25 Nov, 2023 10:41 IST|Sakshi

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. రీసెంట్‌గానే బిచ్చగాడు 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్‌ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా(తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’.

అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్‌.కౌశల్యా రాణి నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులో ఒ.బాబూరావు, జీపీఎస్‌ రెడ్డి విడుదల చేస్తున్నారు. సురేష్‌ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు