సైనికుడి పాత్రలో విజయ్‌ దేవరకొండ

16 Dec, 2020 03:39 IST|Sakshi

సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా ఉంటుందనే సంగతి తెలిసిందే. 2022లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని ప్రకటించారు కూడా. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని టాక్‌. విజయ్‌ దేవరకొండ సైనికుడి పాత్రలో నటించనున్నారని  సమాచారం. 

మరిన్ని వార్తలు