అది విజయ్‌ క్రేజ్‌.. మరో బాలీవుడ్‌ భామతో రొమాన్స్‌‌

13 Mar, 2021 19:59 IST|Sakshi

హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ అయిన తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’ మూవీ బీ-టౌన్‌ వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపించింది. అప్పటి వరకు సక్సెస్‌ లేక మొహం వాచి ఉన్న హీరో షాహిద్‌ కపూర్‌కు ఈ మూవీ మంచి విజయాన్ని అందించింది. అలాగే తెలుగు ‘అర్జున్‌ రెడ్డి మూవీ’లో హీరో నటించిన విజయ్‌ దేవరకొండకు కూడా ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగిపోయింది. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విజయ్‌ నేషనల్‌ హీరోగా మారాడు. హిందీలో కూడా ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ కావడంతో విజయ్‌ పేరు బాలీవుడ్‌లో మారుమ్రోగుతోంది. దీంతో ఈ ‘రౌడీ’‌ హీరోగా మాస్‌ దర్శకుడు పూరి జగన్నాద్‌ ‘లైగర్‌’ పేరుతో పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌, నటి చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు పలు బాషల్లో విడుదల కానుంది.

ఇందులో విజయ్‌ సరసన ఇప్పటికే బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే  నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజా టాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విజయ్‌ తన తదుపరి చిత్రంలో మరో బాలీవుడ్‌ భామ సారా అలీ ఖాన్‌తో రొమాన్స్‌ చేయనున్నట్లు ఫిలీం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులో విజయ్‌ సరసన నటించేందుకు సారా కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ముంబైలో కరణ్‌ జోహార్‌ నిర్వహించిన ఓ పార్టీలో విజయ్‌ పాల్గొన్నారు. ఈ పార్టీలో విజయ్‌తో కలిసి సారా సందడి చేసింది. ఈ క్రమంలో వారిద్దరూ దిగిన ఫొటోను సారా షేర్‌ చేస్తూ వారిద్దరూ మంచి స్నేహితులు అయినట్లు పేర్కొంది. అంతేగాక విజయ్‌కి తను పెద్ద ఫ్యాన్‌ అని కూడా చెప్పింది. 

చదవండి: 
విజయ్‌తో సారా అలీఖాన్‌ సెల్ఫీ.. ఫొటో వైరల్‌

బాలీవుడ్‌ హీరోయిన్లతో విజయ్‌ దేవరకొండ పార్టీ!
అతడి మీద కోపం.. నాపై అరిచేశారు: సారా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు