నాకు చుక్కలు చూపించేవాడు.. ఆనంద్‌కే ముందు పెళ్లి: విజయ్‌ దేవరకొండ

24 Oct, 2021 18:26 IST|Sakshi

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ వస్తున్న ఈ చి​త్రానికి దామోదర దర్శకత్వం వహించగా.. విజయ్‌ దేవరకొండ నిర్మించాడు. ఇందులో ఆనంద్‌ అమాయమైన యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. కాగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ బ్రదర్స్‌ ఇద్దరూ కలిసి ఓ స్పెషల్‌ ఇంటర్వూలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఓ ప్రోమోని విజయ్‌ దేవరకొండ యూట్యూబ్‌ చానెల్‌ విడుదల చేశారు. ‘అమ్మ ఫెవరెట్ ఎవరు?’ అనే ప్రశ్నకు నేనంటే నేనంటూ ఇద్దరూ చేతులు లేపారు. 

అందులో తనకంటే ముందు తమ్ముడికే మ్యారేజ్‌ అవుతుందని విజయ్‌ తెలిపాడు. దానికి కాదు.. తనకే అంటూ ఆనంద్‌ సైగ చేశాడు. అంతేకాకుండా చదువుకునే రోజుల్లో సమ్మర్‌ హాలీడేస్‌ ఇంటికి వచ్చేవాళ్లమని, ఆ సమయంలో తన చిన్ని సోదరుడు చుక్కలు చూపించేవాడని ఈ రౌడీ హీరో చెప్పుకొచ్చాడు. ఇలా ఈ అన్నదమ్ముల స్పెషల్‌ చిట్‌చాట్‌ ఎంతో ఫన్నీగా సాగింది. ఈ సరదా ఇంటర్వ్యూని పూర్తిగా చూడాలంటే అక్టోబర్‌ 25 వరకూ వేచి చూడాల్సిందే. ఆ వీడియోపై మీరు ఓ లుక్‌ వేయండి..

చదవండి: ‘ఫోర్బ్స్’ ప్ర‌భావంత‌మైన న‌టుల జాబితా విడుద‌ల.. అగ్రస్థానం పొందిన‌ ర‌ష్మిక‌

మరిన్ని వార్తలు