కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న విజయ్‌ దేవరకొండ

10 Oct, 2021 13:41 IST|Sakshi

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తన సోదరుడు, హీరో ఆనంద్‌ దేవరకొండలు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి దర్శనంలో విజయ్‌ తన తల్లి, తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నాడు.  అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయం వెలుపల విజయ్‌ను చూసేందుకు, అతడితో ఫొటోలు దిగెందుకు అక్కడికి వచ్చిన భక్తులు ఉత్సహం చూపారు. 

కాగా ప్రస్తుతం విజయ్‌ దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లైగర్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్‌ చివరికి దశకు చేరుకుంది. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి ఈ మూవీ విడుదల చేయ‌నున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.. సినీయర్‌ నటి రమ్యకృష్ణ కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. బాక్సింగ్‌ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. బాక్సింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కెన ఈ చిత్రంలో మైక్‌ టైసన్‌ క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌లో రింగ్‌లోకి దిగుతున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

మరిన్ని వార్తలు