క‌ష్ట‌ప‌డు, ఏదైనా అవ‌స‌రం వ‌స్తే కాల్ చెయ్‌

22 Nov, 2020 20:44 IST|Sakshi

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా, వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌గా తెర‌కెక్కిన చిత్రం "మిడిల్ క్లాస్ మెలోడీస్"‌. గుంటూరు నేప‌థ్యంలోనే సాగే ఈ సినిమా మిడిల్ క్లాస్ కుటుంబాల క‌థ‌. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 20న విడుద‌లైన ఈ చిత్రం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఈ క్ర‌మంలో త‌మ్ముడి చిత్రాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోయారు. చిత్ర‌యూనిట్‌ను ప్ర‌శంసిస్తూ ఓ లేఖ విడుద‌ల చేశారు. ద‌ర్శకుడు వినోద్ అనంతోజుతో పాటు సినిమాలో పాత్ర‌ల‌కు ప్రాణం పోసిన‌ కొండ‌ల్ రావు, గోపాల్ చైత‌న్య‌, దివ్య‌, త‌రుణ్ భాస్క‌ర్.. ఇలా అంద‌రి గురించి చెప్తూ వారి ప్ర‌తిభ‌ను మెచ్చుకున్నారు.  (చ‌ద‌వండి: మిడిల్ క్లాస్ మెలోడీస్: ఎంటర్‌టైనింగ్‌ రియలిజమ్‌)

వ‌ర్ష బొల్ల‌మ్మ పెద్ద క‌ళ్లేసుకుని క్యూట్‌గా క‌నిపిస్తూనే బాగా న‌టించింద‌న్నారు. చివ‌ర‌గా త‌న త‌మ్ముడి గురించి చెప్తూ.. సినిమాల ఎంపిక చేసుకుంటున్న విధానానికి హ్యాట్సాఫ్ చెప్పారు. ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకునేందుకు క‌ష్ట‌ప‌డుతున్న ఆనంద్‌ను చూస్తుంటే ఒక అన్న‌గా గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఇలాగే మ‌రిన్ని కొత్త క‌థ‌ల‌తో, ద‌ర్శ‌కుల‌తో, న‌టీన‌టుల‌తో నీ ప్ర‌యాణం సాగిపోవాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చారు. ఫైన‌ల్‌గా ఒక్క విష‌యం గుర్తుపెట్టుకోమంటూ.. సినిమాలో ఆనంద్ తండ్రి చెప్పే "క‌ష్ట‌ప‌డు.. ఏదైనా అవ‌స‌రం వ‌స్తే కాల్ చెయ్" అనే డైలాగ్‌తో త‌న స‌పోర్ట్ తెలిపారు. (చ‌ద‌వండి: నా సినిమాల్లో అన్నయ్య ప్రమేయం ఉండదు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా