స్టేడియంలో సందడి చేసిన ‘లైగర్‌’

29 Aug, 2022 03:54 IST|Sakshi

దుబాయ్‌: ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోంది. ఇటీవలే పాన్‌ ఇండియా సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ స్టేడియంలో మెరిశారు. మ్యాచ్‍ ప్రారంభం కావడానికి ముందు టీవీ స్క్రీన్ పై సందడి చేశారు. పాకిస్తాన్‌ దిగ్గజం వసీమ్‌ అక్రమ్, భారత మాజీ సీమర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌లతో కలిసి మ్యాచ్‌కు ముందు టీవీ వ్యాఖ్యాతతో తన క్రికెట్‌ సరదా పంచుకున్నారు.

ఓ విధంగా బ్యాటింగ్‌ మెరుపులకు ముందే సినీ తారా మెరుపు సందడి మొదలైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. కాగా, విజయ్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం ‘లైగర్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు