న్యూ ఇయర్‌..న్యూ లవ్‌ స్టోరీస్‌.. వీళ్లు నిజంగానే ప్రేమలో పడ్డారా?

6 Jan, 2022 14:17 IST|Sakshi

2022 స్టార్టింగ్ లోనే న్యూ లవ్ స్టోరీస్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. గతంలో రీల్ పై ప్రేమలో పడినట్లు నటించిన జోడీస్ రియల్ లైఫ్ లోనూ లవ్ లో పడ్డారని జోరుగా ప్రచారం సాగుతోంది.కొద్ది రోజులుగా అలాంటి లవ్ బర్డ్స్ గురించే ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది.

గీత గోవిందం, డియర్ కామ్రెడ్ లో నటించి మెప్పించారు విజయ్ దేవరకొండ, రష్మిక. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ పై చాలా కాలంగా రూమర్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్లే వీరిద్దురు చాలా సార్లు కలసి కనిపించారు. ఒకసారి రెస్టారెంట్ లో మరోసారి ఈవెంట్ లో ఈజోడి అందరికళ్లకు కనిపించారు. ఇప్పుడు లేటెస్ట్ గా గోవాలో వీరిద్దరు కలసి పార్టీ చేసుకున్న ఫోటోస్ బయటికి రావడంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు మళ్లీ జోరందుకున్నాయి.

లైగర్ లో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది అనన్యా పాండే. తనకు ఇది తొలి తెలుగు చిత్రం. బాలీవుడ్ లో మాత్రం డ్రీమ్ గర్ల్ గా వెలుగుతోంది. ఈ బ్యూటీ కూడా డ్ హీరో షాహిద్ కపూర్ బ్రదర్ ఇషాన్ కట్టర్  లవ్ లో పడిందని బీటౌన్ చెబుతోంది. ఇషాన్ కట్టర్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కాలీపీలీ అనే సినిమాలో ఇషాన్, అనన్య కలసి నటించారు.ఈ సినిమా సెట్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిరుగించిందట.రీసెంట్ గా వీరిద్దరు రాజస్తాన్ లోని ఒక నేషనల్ పార్క్ లో  న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. దాంతో వీరిద్దరు త్వరలోనే తమ రిలేషన్ ను అఫీసియల్ చేస్తారని ప్రచారం సాగుతోంది.

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ప్రేమలో పడ్డాడు అని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. తమిళ అర్జున్ రెడ్డి రీమేక్ లో హీరోయిన్ గా నటించిన బనితా సంధుతో ధృవ్ లవ్ లో ఉన్నాడట. ఇటీవల దబాయ్ లో  వీరిద్దరు  న్యూ ఇయర్ వేడుకులను జరుపుకున్నారు. దాంతో ధృవ్, బనితా లవ్ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది.

మరిన్ని వార్తలు